Punya bhumi naa desam Song Lyrics – Major Chandrakanth

Punya bhumi naa Desam Song Lyrics In Telugu

పుణ్యభూమి నాదేశం నమో నమామి..
ధన్యభూమి నాదేశం సదా స్మరామి.

నన్ను కన్న నాదేశం నమో నమామి..
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ….నా దేశం…..

అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు… సార్వ భౌముడు…
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
ఒరేయ్‌ ఎందుకు కట్టాలిరా శిస్తు,
నారు పోసావా…. నీరు పెట్టావా ….
కోత కోసావా …. కుప్పనూర్చావా….
ఒరేయ్ తెల్ల కుక్క
కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా…
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు

అదిగదిగో…అదిగదిగో… ఆకాశం భల్లున తెల్లారి
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి భానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పెనైతె
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి
మందీ మార్బలమెట్టి మరఫిరంగులెక్కిపెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందే మాతరం వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం

అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుద సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర్య భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు.
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్

గాంధీజి కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే
ధ్రువ తారల కన్నది ఈ దేశం
చరితార్ధుల కన్నది నా భారతదేశం నా దేశం

Leave a Reply

Your email address will not be published.